నోట్లో గన్ పెట్టి కాల్చితే.. కింద నుండి ఎలా బుల్లెట్ వచ్చింది.. డైరెక్టర్ క్లారిటీ?

praveen
టాలీవుడ్ లో సీనియర్ హీరోగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత ఒక ఇండివిజువల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొన్నటి వరకు ఇక ఇతర హీరోలతో కలిసి మల్టీ స్టారర్ తో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్.. ఇక చాలా రోజుల తర్వాత తన యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేందుకు రెడీ అయ్యాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకటేష్ కెరియర్ లో  75వ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ సినిమాతో వెంకటేష్ సాలిడ్ హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

 ఇక ఈ మూవీలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా సినిమాల్లో కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అతిగా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవల విడుదలైన సైంధవ్ ట్రైలర్ లో కూడా ఒక సీన్ ఇలాగే కాస్త అతిగా అనిపించింది. ఏకంగా వెంకటేష్ ఒక వ్యక్తికి నోట్లో గన్ పెట్టి కాల్చితే అతని మలద్వారం ద్వారా బుల్లెట్ బయటికి వచ్చినట్లు చూపించారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై ట్రోల్స్ వస్తున్నాయి. స్వయంగా దర్శకుడు శైలేష్ కొలను స్పందించాడు. నోట్లో గన్ పెట్టి కాల్చితే బుల్లెట్ కడుపులో ఎలా ట్రావెల్ చేసిందో అని ఒక ఫన్నీ వీడియో వైరల్ అవ్వగా దీనిపై శైలేష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 వీడియో చాలా ఫన్నీగా ఉంది. నాకు ఏ విషయమైనా వివరించి చెప్పడానికి ఇష్టపడతా. మామూలుగా నోట్లో తుపాకీ పెట్టికాలిస్తే బుల్లెట్ తల వెనుక నుంచి బయటకు రావాలి. కానీ ఆ సన్నివేశంలో ఒక వ్యక్తిని నిర్దిష్ట దిశలో కూర్చోబెట్టి గన్ ను అతని నోటి లోపలకి పెట్టి మరి షూట్ చేశాడు. అయితే తుపాకీని 80 డిగ్రీల కోణంలో కిందకు వంచి కాల్చితే బాడీలో ఉన్న అవయవాలను చీల్చుకుంటూ బుల్లెట్ బయటికి వస్తుంది అంటూ దర్శకుడు శైలేష్ చెప్పుకొచ్చాడు. శ్వాస కోస, అన్నవాహిక, కాలేయం,  పెద్ద, చిన్న పేగులను చీల్చుకుంటూ అదే యాంగిల్ లో శరీరం కింద నుంచి బుల్లెట్ బయటికి వస్తుంది అంటూ శైలేష్ వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: