నితిన్ సినిమాలో స్పెషల్ సాంగ్.. రంగంలోకి బాలీవుడ్ బ్యూటీ?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నితిన్ హిట్ అనే పదానికి చాలా దూరమైపోయాడు అన్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్టు కొట్టలేకపోతున్నాడు. ఇటీవల ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇక ఈ మూవీ విడుదల అవడానికి ముందు ఇక ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అందరిలో రెట్టింపు చేసింది. ఏకంగా ఈ మూవీలో నితిన్ జూనియర్ ఆర్టిస్టు పాత్రలో కనిపిస్తూ ఉండడంతో ప్రేక్షకులను కడుపుబ్బ  నవ్వించబోతున్నాడు అని అందరూ ఫిక్స్ అయ్యారు.

 ఈ క్రమంలోనే సినిమా విడుదలైన తర్వాత ఇదే ఆలోచనతో థియేటర్ కు వెళ్లారు. కానీ ఎందుకో ప్రేక్షకులను ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా మాత్రం మెప్పించలేకపోయింది అని చెప్పాలి. ప్రేక్షకులు అంచనాలను అందుకోలేకపోయింది. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కు మరోసారి నిరాశ ఎదురయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం హిట్టు కొట్టాలనే కసి నితిన్ లో బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తన తర్వాత సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో.  ప్రస్తుతం దర్శకుడు వెంకి కుడుములతో ఒక మూవీ చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గతంలో నితిన్ - వెంకీ కుడుములో కాంబినేషన్లో భీష్మ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది.

ఇక ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో ఈ మూవీపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇందులో ఒక ఐటెం సాంగ్ ఉంటుందట. అయితే అది సినిమాకే ఫుల్ ఎనర్జీని ఇస్తుందని ప్రేక్షకులందరికీ కూడా విజిల్స్ వేసేలా చేస్తుందని సమాచారం. అయితే ఈ సాంగ్ కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రథౌలాను సంప్రదించారట చిత్ర బృందం. ఇక ఆమెకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఐటెం సాంగ్ షూటింగ్ కూడా ప్రారంభమవుతుందట. అయితే గతంలో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఊర్వసి ఐటెం సాంగ్ చేసింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: