మెగాస్టార్ చిరంజీవి అంటే.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఇంత పిచ్చి అభిమానమా?

praveen
సందీప్ రెడ్డి వంగ.. ఈ పేరు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా గట్టిగా వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఓవర్ నైట్ లో విజయ్ దేవరకొండ ఎలా అయితే స్టార్ హీరోగా మారిపోయాడో.. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా అదే స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే తనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన అర్జున్ రెడ్డి సినిమా నే కబీర్ సింగ్ పేరుతో హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు ఈ డైరెక్టర్. ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తీసుకొని ఇటీవల యానిమల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఇక బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది. దీంతో సందీప్ రెడ్డికి ఉన్న క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మెగాస్టార్ చిరంజీవికి ఒక పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ.

 అంతేకాదు మెగాస్టార్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మాస్టర్ మూవీలోని ఒక సన్నివేశం గురించి కూడా వివరించాడు అని చెప్పాలి. చిరంజీవి, సాక్షి శివానంద్ కలిసిన నటించిన మాస్టర్ మూవీ 1997లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అయితే ఈ విషయం గురించి సందీప్ మాట్లాడుతూ.. మాస్టర్లో చిరంజీవి సాక్షి శివానంద్ తో తన ఫ్లాష్ బ్యాక్ గురించి వివరించే సమయంలో ఆయన వేసుకున్న షర్ట్ కలర్ గురించి తెలిపాడు. ఆ సీన్లో చిరంజీవి కోపంగా సిగరెట్ కాల్చే సీన్ అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఎప్పుడో విడుదలైన మూవీలోని ఒక సన్నివేశంలో చిరంజీవి వేసుకున్న షర్టు కలర్ ని కూడా చెప్పాడంటే.. మెగాస్టార్ కి సందీప్ రెడ్డి  ఎంత పిచ్చి అభిమానో అర్థం చేసుకోవచ్చు అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: