ప్రభాస్ నటించిన ఫ్లాప్ సినిమా.. వంద రోజులు ఆడిందట తెలుసా?

praveen
సాదరణంగా ఒక సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు ఇక ఆ సినిమాకు వెళ్లేందుకు ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే అలాంటి సినిమాలను ఇక థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడించడానికి ఇక ఆయా థియేటర్ల యాజమాన్యాలు కూడా నిర్ణయించుకుంటాయి అని చెప్పాలి. కానీ ఏదైనా సినిమాకి ఏకంగా ఫ్లాప్ టాక్ వచ్చింది అంటే ప్రేక్షకులు లేక పూర్తిగా థియేటర్లు అన్నీ కూడా బోసిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా ఏదైనా సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తే ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన కొత్త సినిమాని తమ థియేటర్లో ఆడించి ఇక ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాని అక్కడి నుంచి తొలగిస్తారు.

 ఇది సర్వసాధారణం. అయితే హిట్టు టాక్ వస్తేనే ఆయా సినిమాలు 100 రోజులు ఆడటం చాలా కష్టం. కానీ అటు ప్రభాస్ నటించిన ఒక సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఏకంగా వంద రోజులు ఆడిందట. ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ బిగ్గెస్ట్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. బాహుబలి తర్వాత టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక వరుస సినిమా షూటింగులతో ఒక క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్. ఇక ఇటీవల సలార్ అనే మూవీ తో సూపర్ హిట్ కొట్టాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ప్రభాస్ హీరోగా నటించిన మున్నా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 100 రోజులు ఆడిందట. ఈ సినిమాలో ఇలియానా ప్రభాస్ సరసన నటించగా.. దిల్ రాజు నిర్మాత. భారీ అంచనాల మధ్య విడుదలైన మున్నా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం ఏకంగా తొమ్మిది సెంటర్లలో దాదాపు 100 రోజులు ఆడిందట. ఈ విషయం తెలిసి నిర్మాత దిల్ రాజు తో పాటు ప్రభాస్ కూడా షాక్ అయ్యారట. అయితే ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని ముందు నుంచి నిర్మాత దిల్ రాజు అనుకున్నారట. కానీ ప్రభాస్ మాత్రం హిట్ అవుతుందని అనుకున్నప్పటికీ.. ఇక డార్లింగ్ అంచనాలు తారుమారు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: