అనుపమ పరమేశ్వరన్.. ఆ టాలీవుడ్ స్టార్ హీరోకి చెల్లి అవుతుందా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని చెబుతూ ఉంటారు ఎంతోమంది సినీ విశ్లేషకులు. ఎందుకంటే టాలెంట్ లేకపోయినా ఒక్కోసారి అదృష్టం కలిసి వచ్చి కొంత మంది ఏకంగా స్టార్లుగా ఎదుగుతుంటారు. ఇక కొన్నిసార్లు టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చి బిగ్గెస్ట్ స్టార్స్ గా అవుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎంత టాలెంట్ ఉన్న అదృష్టం లేక చివరికి గుర్తింపు కోసం పాకలాడుతూనే ఉంటారు. అలాంటి హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు అని చెప్పాలి.

 ఆమెకు నటనలో మంచి టాలెంట్ ఉంది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలదు. ఇక ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో కూడా నటించింది. కానీ అదృష్టం మాత్రం అసలు కలిసి రావడం లేదు. సరైన గుర్తింపును ఇప్పటికీ సంపాదించుకోలేక పోతుంది. అయితే ప్రస్తుతం అనుపమ టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుంది. ఇక అటు సోషల్ మీడియాలోను ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ తో అటు సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటూ ఉంటుంది.

 అయితే ఇక ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా మలయాళ బ్యూటీ అనుపమ ఒక టాలీవుడ్ హీరో కి చెల్లెలు వరస అవుతుందట. అదెలా అనుకుంటున్నారు కదా. ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ అనుపమ తన కూతురు లాంటిది అని చెప్పినట్లు సమాచారం. ఆ అమ్మాయి బాగా నటిస్తుంది. చాలా పద్ధతిగా ఉంటుంది. డెడికేషన్ గల వ్యక్తి. ఈ అమ్మాయి లాంటి కూతురు నాకు ఉంటే బాగుండేది అంటే అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ లెక్కన అనుపమ అల్లు అర్జున్ కు చెల్లెలు అవుతుందని సోషల్ మీడియాలో ఒక చిన్న చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: