'హనుమాన్' అసలు టైటిల్ కాదా.. వామ్మో దీని వెనుక ఇంత అర్థం ఉందా?

praveen
ఇప్పటివరకు తన సినిమాలతో  ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇక వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ సూపర్ హిట్లు సాధిస్తున్న యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్లో తెరకేక్కుతున్న హనుమాన్ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక తేజ సజ్జ కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ సంక్రాంతికి ఎంతో మంది బడా హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. తమ సినిమా మీద ఉన్న నమ్మకంతో హనుమాన్ మేకర్స్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా సంక్రాంతికి తమ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తేజ సజ్జ సినిమాకు హనుమాన్ అనే టైటిల్ ఏకంగా హనుమంతుడి పేరు కలిసి వచ్చింది కాబట్టి పెట్టారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అటు చిత్ర బృందం మాత్రం ఈ టైటిల్ ని మరో విధంగా భావిస్తుందట. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 బాలీవుడ్లో బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, యాంట్ మ్యాన్ ఇలా మార్వెల్స్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్లో హనుమాన్ అని తెరకెక్కించారట. అంటే హనుమంతుడి పవర్స్ ఒకరికి రావడంతో అతను హను మ్యాన్ గా మారిపోయాడనే ఉద్దేశంతోనే మూవీ టీం ఈ టైటిల్ని పెట్టిందట. అందుకే ఈ సినిమాకు 'hanuman' అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అందరూ దీనిని హనుమాన్ అని పిలుస్తున్నారు. కానీ వాస్తవానికి మాత్రం 'హను మ్యాన్' అనేది మేకర్స్ పెట్టిన అసలు టైటిల్ అని సమాచారం. ఇక ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు అన్న విషయం తెలుస్తుంది. కాగా వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై హీరో తేజ సజ్జ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది అంటే తేజ స్టార్ హీరోగా మారే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: