చిరంజీవి కెరియర్లోనే అతిపెద్ద కాంట్రవర్సీ.. బ్యాన్ అయిన సినిమా ఏదో తెలుసా?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నటనతో కొత్త ట్రెండుకు నాంది పలికాడు అనే విషయం తెలిసిందే. తన డాన్సులతో ఏకంగా తెలుగు ప్రేక్షకులు అందరిని కూడా మెస్మరైజ్ చేశాడు. ప్రతిసారి పాత ట్రెండును మార్చడానికి ఒకడు వస్తూ ఉంటాడు. ఇక అతనే చిరంజీవి అని సినీ ప్రేక్షకులు అందరూ కూడా అనుకునేలా ప్రభావితం చేశాడు చిరంజీవి. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోగా చక్రం తిప్పాడు అని చెప్పాలి. ఇప్పటికి కూడా సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలతో సూపర్ హిట్లు కొడుతూనే ఉన్నాడు.

 అయితే చిరంజీవి కెరీర్ లో ఎన్నో మాస్ కమర్షియల్ హీట్లు ఉన్నాయి. అలాగే ఎన్నో క్లాస్ హిట్లు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఇక చిరు నటించిన కొన్ని సినిమాల్లో విమర్శలు ఎదుర్కొన్న సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒక సినిమా ఏకంగా బ్యాన్ కూడా అయింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా అల్లుడా మజాకా 1995లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే దేవి వరప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఇక చిరంజీవి శాసన రమ్యకృష్ణ, రంభ, ఊహ హీరోయిన్లుగా నటించారు.

 ఈ మూవీ రిలీజ్ అయిన  తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏకంగా మహిళలను అసభ్యకరంగా చూపించారు అంటూ కమ్యూనిస్టులు హిందూ జాతీయవాదులు ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరిగాయి. దీంతో ఇక ఈ సినిమా విషయంలో పునరాలోచించుకున్న సెన్సార్ బోర్డు చివరికి అల్లుడా మజాకా మూవీ ని బ్యాన్ చేసింది. దీంతో చిరంజీవి అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఇక ఈ సినిమాలోని అసభ్యకర సన్నివేశాలను తొలగించి సినిమాను ప్రదర్శించుకోవచ్చు అంటూ సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఇలా సినిమా విడుదలైన తర్వాత మహిళా సంఘాలు కమ్యూనిస్టులు ధర్నాలు చేయడం సంచలనంగా మారితే.. సినిమా బ్యాన్ అయిన తర్వాత ఇక చిరంజీవి అభిమానుల ధర్నాలు మరింత సంచలనం సృష్టించాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: