రివ్యూ: డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్ సక్సెస్ కొట్టినట్టేనా..?
డెవిల్ సినిమా అద్భుతంగా ఉందని మైండ్ బ్లోయింగ్ అయ్యే ట్విస్ట్ లో ఉన్నాయని కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని తెలియజేస్తున్నారు..BGM నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ కళ్యాణ్ రామ్ ఊచకోత బ్లాక్ బాస్టర్ అంటూ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మరొకసారి కళ్యాణ్ రామ్ విజయ పతాకాన్ని కంటిన్యూ చేస్తున్నారని మరొక నేటిజన్ తెలుపుతున్నారు.
సెకండాఫ్ చాలా అద్భుతంగా ఉందని ఫస్ట్ ఆఫ్ డీసెంట్గా సరిపోయిందని..BGM అద్భుతంగా ఉందంటూ కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపాన్ని చూపించారంటూ డెవిల్ సినిమా వన్ టైం వాచబుల్ అంటూ మరొక నెటిజన్ తెలియజేశారు.
డెవిల్ మూవీ మొదటి భాగం అంతా కూడా స్టోరీ మీదే నడుస్తుందని సెకండ్ పార్ట్ లో ట్విస్టులు చిల్ మూమెంట్స్ ఉంటాయని ఫస్ట్ ఆఫ్ కంటే రెండో భాగమే బాగుందంటూ తెలియజేస్తున్నారు.. గుడ్ త్రిలర్ కమర్షియల్ మూవీ అంటూ మరొక నేటిజన్ ట్విట్ చేశారు.
ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఈమె నటన కూడా అద్భుతంగా ఉందంటూ తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్లాక్ బస్టర్ మూవీని సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ నాటి కాలం కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఇందులో ఒక హత్య జరగడం జరుగుతుంది దానిని చేదించేందుకే సీక్రెట్ ఏజెంట్ నియమిస్తారు ఆ సీక్రెట్ ఏజెంట్ కళ్యాణ్ రామ్ అన్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబడతారో చూడాలి మరి.