మెగాస్టార్ ని ఉద్దేశించి మోహన్ బాబు అలా అంటున్నారా...??

murali krishna
ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల మధ్య మంచి స్నేహ బందం ఉంటుంది. కానీ కొంతమంది మధ్య మాత్రం ఎప్పుడూ గొడవలు అనే జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ల లో చిరంజీవి, మోహన్ బాబు ముందుగా ఉంటారు.చిరంజీవి కామ్ గా ఉన్నప్పటికీ మోహన్ బాబు ఎప్పుడు ఏదో ఒకటి గిల్లుతూ చిరంజీవి మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మళ్లీ మోహన్ బాబు బయటికి వచ్చి చిరంజీవి మీద ఎదో కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే ఇప్పటికే మంచు విష్ణు మా అధ్యక్షుడికి ఎన్నికై రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఇప్పటి వరకు ఒక్క పని కూడా సక్రమంగా చేయకపోవడంతో ప్రకాష్ రాజ్ లాంటివారు మంచు విష్ణు ని ఉద్దేశించి చాలా రకాల విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది తెలుసుకున్న మోహన్ బాబు ప్రకాష్ రాజ్ వెనకాల ఎవరు ఉండి ఇలా మాట్లాడిస్తున్నారో నాకు అంత తెలుసు అని డైరెక్టు గా చిరంజీవి ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే చిరంజీవికి ప్రకాష్ రాజ్ మాట్లాడించాల్సిన అవసరం లేదు అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  నిజానికి మోహన్ బాబు ఎప్పుడు ఎవరిని ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూనే ఉంటాడు అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.అయితే నిజానికి మోహన్ బాబు చిరంజీవి ని ఉద్దేశించి మాట్లాడడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రకాష్ రాజ్ మాత్రం మంచు విష్ణు ని అవకాశం వచ్చిన ప్రతిసారీ విమర్శిస్తునే ఉన్నాడు. ఇక మళ్లీ మా ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా ఎవరు ఈసారి ఎలక్షన్స్ లో పోటీ చేస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది... మళ్లీ ఈసారి ప్రకాష్ రాజ్ పోటీ చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: