HBD: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఎవరి మనవడో తెలుసా..?

Divya
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు పుట్టుకొచ్చినా వారిలో కొంతమందికి మాత్రమే మంచి పేరు ఉంటుందని చెప్పవచ్చు. అలాంటి వారిలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ కూడా ఒకరు. ఎక్కువగా మెగా హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తూ మరింత పేరు దక్కించుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన ఈయన ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన గురించి మనకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
ఎస్ఎస్ తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్.. తమన్ గా  మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తెలుగు, తమిళ్ చిత్రాలలో పనిచేసే భారతీయ సినీ సంగీత దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా మొదటిసారి రవితేజ హీరోగా నటించిన కిక్ అనే సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరీర్ ను ప్రారంభించిన తమన్ , ఆ తర్వాత బాయ్స్ చిత్రంలో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో కూడా నటించారు. ఇక తర్వాత దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా నిలదొక్కుకున్న బ్రాహ్మణ  కుటుంబంలో ఆంధ్ర ప్రదేశ్లో జన్మించాడు.
 ఇక ఈయన ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు పూర్తిస్థాయి హీరోగా నటించిన సీతారామ జననం సినిమాను తెరకెక్కించిన ఆ కాలపు దర్శకుడు బలరామయ్య మనవడు కావడం గమనార్హం.  తమన్ పొట్టేపాళెం, నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు. ఇతని తండ్రి ఘంటసాల శివ కుమార్, అతను స్వరకర్త కె. చక్రవర్తి దగ్గర ఏడువందల సినిమాల్లో పనిచేసిన ఒక డ్రమ్మర్, తన తల్లి ఘంటసాల సావిత్రి నేపథ్య గాయని, తన అత్త పి. వసంత కూడా గాయనీమణి. తమన్ నేపథ్య గాయని శ్రీవర్ధినిని వివాహం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.  అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు దక్కించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: