ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదల కానున్న విజయ్ మూవీ....??
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.. తాజాగా ఈ సినిమా ఐమాక్స్ వర్షన్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను యూఎస్ డిస్టిబ్యూటర్స్ అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు..మరి మన ఇండియాలో కూడా ఐమాక్స్ ఫార్మాట్ లోనే రిలీజ్ చేస్తారో లేదో మరి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మలేషియాలో ఎంతో గ్రాండ్ గా చేయబోతున్నారు అని సమాచారం... అక్టోబర్ 14న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ గ్రాండ్ గా జరగబోతుండగా టీమ్ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొననుంది. ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.