జవాన్: మెంటల్ ఎక్కిస్తున్న షారుఖ్ రికార్డ్స్?

Purushottham Vinay
బాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూవీ రిలీజ్ అంటేనే దేశమంతటా కూడా అభిమానులకు ఓ పండగ వాతావరణం. ఆయన గత సినిమా పఠాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఏకంగా వేయి కోట్లకు పైగా కొల్లగొట్టింది.అయితే, ఆయన తాజాగా నటించిన జవాన్ చిత్రంపై కూడా ప్రేక్షకులకు పెద్ద ఎత్తున భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 న తెలుగు, తమిళ ఇంకా హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతోంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 'జవాన్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరబాద్, కోల్‌కతా ఇంకా చెన్నైల్లో ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతోంది.


అడ్వాన్స్ బుకింగ్స్ తీరు చూస్తే జవాన్ మూవీ భారత చలనచిత్ర చరిత్రలో ఖచ్చితంగా రికార్డులను క్రియేట్ చేసేలా కనిపిస్తుంది.ఇక ఇప్పటికే పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో 1,70,295 టికెట్లు, ఐనాక్స్ 1,15,218 టికెట్లు ఇంకా సినీ పోలీస్ లో 57,120 టికెట్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీ లో 60 వేల టికెట్లు, ముంబై లో 55 వేల టికెట్లు , బెంగుళూరు లో 60 వేల టికెట్లు , కోలకతా లో 50 వేల టికెట్లు ఇంకా అలాగే చెన్నై లో 75 వేల టికెటలు అమ్ముడయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి దాకా రూ.26 కోట్లు వచ్చేశాయి. దీంతో జవాన్ మూవీ బాహుబలి 2, గదర్ 2 ఇంకా పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను బద్దలు కొట్టింది. బుక్ మై షో యాప్ లో ఏకంగా 1 మిలియన్ టికెట్స్ సొల్డ్ అయ్యాయి అంటే జవాన్ క్రేజ్ ఏంటో ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ మూవీలో నయనతార, దీపికా పదుకొనె, ప్రియమణి , విజయ్ సేతుపతి అలాగే యోగి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: