మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంది అంటున్న అమలాపాల్.....!!

murali krishna
చాలా కాలంగా సినిమా లకు దూరం గా ఉంటున్న అమలాపాల్ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాను చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులతో అమలాపాల్ పంచుకుంటుంది.తాజాగా మట్టితో బొమ్మలు చేస్తూ దిగిన ఫొటోలను పంచుకుంది. మన పని మనం అత్యుత్తమం గా చేయాలని పోస్టులో చెప్పుకొచ్చింది. కష్టమైన పనైనా ఇష్టంతో పూర్తిచేయాలని సూచించింది. అలాగే మలయాళం లో తన ఫాలోవర్స్ తో ఈ బ్లాక్ బ్యూటీ కొని ముచ్చట్లు పెట్టింది. ఆ ముచ్చట్ల పై కూడా ఇప్పుడు నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ, అమలాపాల్ పెట్టిన ముచ్చట్లు ఏమిటంటే.. నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు కాబోయే వాడు దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉంటేనే పెళ్లాడతాను. అలాగే వాడు బెడ్ రూమ్ లో సింహం లా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో పులిలా ఉండాలి' అని అమలాపాల్ చెప్పుకొచ్చింది. అమలాపాల్ ఇంకా మాట్లాడుతూ.. "నాకు మా నాన్నే ఆదర్శం. నా తండ్రి లా దయ, ప్రేమ, ఫన్నీ గా ఉండే వాడినే వివాహమాడతాను. మా నాన్న లాంటి లక్షణాలే అతనికి ఉండాలి. అప్పుడు అతను నన్ను బాగా అర్ధం చేసుకుంటాడు' అని అమలాపాల్ చెప్పింది.
అలాగే గతం లో తన పెళ్లి గురించి.. అలాగే ఎఫైర్స్ గురించి కూడా అమలాపాల్ బోల్డ్ కామెంట్స్ చేసింది. పెళ్ళికి ముందే నేను డేటింగ్ చేశాను. పెళ్లి తర్వాత కూడా నేను డేటింగ్ చేశాను. అందుకే.. నాకు పెళ్లి అనేది పెద్దగా ఫీలింగ్ లేదు అని తెలిపింది. ఇక సినిమాల గురించి చెబుతూ.. ' నాకు ప్రేమకథా చిత్రాల తో పాటు థ్రిల్లర్‌ మూవీస్‌ లో నటించాలనుందని, ముఖ్యంగా.. అరుంధతి సినిమా లో అనుష్క లాంటి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్‌' అని అమలాపాల్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: