రాయి ఎటక్: సీఎం జగన్ కేసులో నిందితుడు విడుదల..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఎలక్షన్స్ సమయంలో ప్రచారంలో భాగంగా చేస్తున్న సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన రాయి దాడి కొంతమంది దుండగులు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేసిన తర్వాత కొంతమందిని పట్టుకోగా అందులో ముఖ్యమైన నిందితుడు సతీష్ గా గుర్తించారు. కొద్దిరోజులు జైల్లో ఉంచిన తర్వాత విజయవాడ ఎనిమిదవ వాదనపు జిల్లా కోర్టు నుంచి బెయిల్ మంజూరు చేసుకున్నట్లు తెలుస్తోంది.. దీంతో సతీష్ ను జైలు నుంచి విడుదల చేసే విధంగా పలు రకాల ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు సమాచారం.

నిందితుడు సతీష్ ను కూడా విడుదల చేయడానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మెట్రోపాలిటీ మెజిస్టేషన్..445 సి ఆర్పిసి పిటిషన్ అనుమతించి నిందితుని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.. నిన్నటి రోజున నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి సతీష్ ని విడుదల చేసినట్లు సమాచారం. అయితే బెయిల్ పైన మంజూరు వేల పలు రకాల షరతులను కూడా అధికారులు విధించినట్లు తెలుస్తోంది.. ప్రతి శని ఆదివారా లలో కచ్చితంగా స్థానిక పోలీస్ స్టేషన్లోకి వెళ్లి సంతకం చేయవలసి ఉంటుందంటూ హెచ్చరించారు.

వీటితో పాటు రూ .50వేల రూపాయలు ఇద్దరు శూరిటీలు కూడా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఊరు వదిలి అసలు వెళ్ళకూడదని కేసులో పోలీసులు విచారణ సహకరించాలని కూడా తెలియజేశారు.. ఎన్నికల వేళ ఏప్రిల్ 13వ తేదీన విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి జరగడంతో ఈ నిందితుడిని పట్టుకోవడం జరిగింది.ముఖ్యంగా జగన్ కనుబొమ్మపై భాగంలో రాయి తాకినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయం పైన కొంతమంది నేతలు కావాలని చేయించారనే విధంగా ఆరోపణలు వినిపించాయి.. ముఖ్యంగా విజయవాడలోనే కొంతమంది నేతలు ఈ విధంగా చేసి ఉన్నారనే విధంగా వైసీపీ నేతలు ఆరోపించారు. మరి ఎలక్షన్స్ అయిపోయినిచ్చి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: