బీఆర్ఎస్ పోతే : పాతాళంలోకి వెళ్లిపోయిన బీఆర్ఎస్.. పుంజుకునే ఛాన్స్ లేదా?

Reddy P Rajasekhar
తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కారు జోరు చూపించే అవకాశం లేదని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ మాత్రం 11 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుతుందని చెబుతుండగా ఈ సర్వే ఫలితాలను చూసి బీఆర్ఎస్ నేతలే నవ్వుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రాష్ట్రంలో బీఆర్ఎస్ పుంజుకునే ఛాన్స్ లేదా అనే ప్రశ్నకు ఇప్పట్లో అయితే లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉండటం కూడా ఆ పార్టీకి ఒకింత ప్లస్ అవుతోందని చెప్పవచ్చు. కేటీఆర్ పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ బాధ్యతలను తీసుకుంటే మాత్రమే రాష్ట్రంలో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
2028 అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పై కొంతమేర వ్యతిరేకత అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ బీఆర్ఎస్ కు అర్బన్ ఓటర్ల సపోర్ట్ అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికైనా సరైన నిర్ణయాలను తీసుకుని కేసీఆర్, కేటీఆర్ ముందడుగులు వేస్తే పార్టీకి పూర్వ వైభవం రావడం మరీ కష్టం అయితే కాదని చెప్పవచ్చు. ఇప్పటికీ తెలంగాణకు చెందిన కొంతమంది ఓటర్లు కేవలం మార్పు కోసం మాత్రమే కాంగ్రెస్ ను గెలిపించామని చెబుతున్నారు.
 
కేసీఆర్ ఎన్నో కలలు కని కష్టపడి గెలిపించుకున్న పార్టీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి నిరాశ పరుస్తుంటే ఆ పార్టీని నమ్ముకున్న నేతలు అనుభవిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా గెలుపోటములు సహజమేననే సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి ఫలితం వచ్చినా సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మాత్రమే భవిష్యత్తులో ఆశించిన ఫలితాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 2028 ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: