బీఆర్ఎస్ పోతే : రాష్ట్రంలో బీఆర్ఎస్ కు సున్నా.. కేసీఆర్ డౌన్ ఫాల్ కు కారణాలివేనా?

Reddy P Rajasekhar
కొన్ని నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపుగా నిజమైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సంస్థలు తెలంగాణ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. అయితే మెజారిటీ సర్వే సంస్థలు రాష్ట్రంలో బీఆర్ఎస్ సున్నా స్థానాలకే పరిమితం కావచ్చని చెబుతున్నాయి. ఒక స్థానంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
 
రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఇంత దారుణమా అని నెటిజన్లు అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కేసీఆర్ డౌన్ ఫాల్ కు కారణాలేంటనే ప్రశ్నకు వేర్వేరు జవాబులు వినిపిస్తున్నాయి. కవిత అరెస్ట్ కూడా బీఆర్ఎస్ పై ప్రభావం చూపిందనే చెప్పాలి. ఎం.ఐ.ఎం. ఖచ్చితంగా ఒక స్థానంలో గెలుస్తుందని చెప్పిన సర్వేలు బీఆర్ఎస్ విషయంలో మాత్రం ఆ నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి.
 
కేసీఆర్ తన పాలనలో ప్రజాభీష్టానికి అనుకూలంగా పాలన సాగించకపోవడం ఒక విధంగా మైనస్ అయితే పార్టీ పేరును టీ.ఆర్.ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. పేరు మార్చితే కొంతమేర అయినా ఫలితాలు మారే ఛాన్స్ ఉందని చాలామంది నేతలు కేసీఆర్ కు సూచనలు చేసినా పరిస్థితి మాత్రం మారలేదు. ఒకప్పుడు కేసీఆర్ హీరోలా ఒక వెలుగు వెలిగారని ఇప్పుడు మాత్రం ఆయన పార్టీకి వచ్చే సీట్లు జీరో అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
కేటీఆర్ సైతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించి ఇప్పటికే రియాక్ట్ కావడం జరిగింది. మాకు ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేదని కేటీఆర్ కామెంట్లు చేశారు. అయితే అన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలను ప్రకటించి ఉంటే ఆయన ఇలానే కామెంట్ చేసేవారా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహాన్ని నింపుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: