ఆరా మస్తాన్: ఏపీలో తన సర్వేపై సంచలన వ్యాఖ్యలు..!

Divya
దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ నిన్నటి రోజున వచ్చేసాయి. ఇందులో ఎటువంటి తేడాలు లేకుండా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటూ అన్ని సర్వేలు కూడా తెలియజేశాయి. కానీ రాష్ట్రలా పరిస్థితికి వచ్చేసరికి సర్వేలు చాలా భిన్నమైన ఫలితాలను కూడా తెలియజేశాయి.. నేషనల్ సర్వేలు టిడిపి కూటమి విజయం సాధిస్తుందని పలు రకాల సర్వేలు కూడా ప్రకటించాయి.. ఇప్పటికే చాలా సర్వేలు కూడా వైసీపీకే పట్టం కట్టాయి.. అయితే ఎంతోమంది ఎగ్జైటింగ్ గా ఎదురు చూసినవారు ఆరా మస్తాన్ సర్వే..

ఆరా మస్తాన్ తన సర్వేలో నిన్నటి రోజున తిరిగి మళ్లీ వైసీపీ పార్టీని అధికారంలోకి వస్తుందని అది కూడా 94 నుంచి 104 సీట్లు విజయాన్ని అందుకుంటుందంటూ తెలియజేశారు. అంతేకాకుండా పలువురు మంత్రులు కూడా ఈ ఎన్నికలలో ఓడిపోతారంటూ ఆయన వెల్లడించారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆరా మస్తాన్ తన సర్వే రిపోర్ట్ గురించి వివరించారు.. రోజా, సిదిరి అప్పలరాజు, అమర్నాథ్ వంటి మంత్రులు ఓడిపోతారని వెల్లడించారు. అలాగే విడుదల రజిని అంబాటి రాంబాబుకు గట్టి పోటీ ఉంటుందంటూ తెలియజేశారు.

హైదరాబాద్ నుంచి వచ్చిన వారంతా కూటమికి ఓట్లు వేశారని చెప్పడం తప్పే అవుతుందని ఆయన వెల్లడించారు.. కూటమిలో బిజెపి కలవడం వల్ల టీడీపీకి మైనస్ గా మారిందని అయితే ఆఖరిలో ఏపీలో మీ సర్వే ఫెయిల్ అయితే ఏం చేస్తారని యాంకర్ అడగగా.. ఏపీలో నా సర్వే వందకు వందశాతం నిజం అవుతుంది నా సర్వే లెక్క తప్పితే ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఉండరని కూడా ఆయన తన సర్వే పైన ధీమాని తెలియజేశారు. నా సర్వేకు వైసిపి 10 సీట్లు అదనంగా పెరుగుతాయే కానీ తగ్గడం ఉండదని కూడా ఆయన తన అభిప్రాయంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: