రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగాడు.. విజయ్ సినిమాలలోకి వచ్చినా హీరోగా ఛాన్స్ రావడానికి చాలా టైం పట్టింది.. “పెళ్లిచూపులు” మూవీతో విజయ్ దేవరకొండ హీరోగా మారారు..తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూవీ విజయ్ కెరీర్ లో మొదటి విజయం తెచ్చిపెట్టింది.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది..కానీ విజయ్ నటించిన రెండో మూవీ ‘ద్వారక’ ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు.. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన “ అర్జున్ రెడ్డి “ సినిమాతో విజయ్ కెరీర్ టర్న్ అయిపోయింది..ఆ సినిమా పుణ్యమా అంటూ విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. విజయ్ కెరీర్ నీ మలుపు తిప్పిన సినిమాగా అర్జున్ రెడ్డి నిలిచింది.. ఆ సినిమాలో విజయ్ బోల్డ్ యాక్టింగ్ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది.. విజయ్ కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువైంది కూడా అర్జున్ రెడ్డి సినిమాతోనే.. దీనితో టాలీవుడ్ మొత్తం విజయ్ దేవరకొండ పేరు మారు మ్రోగిపోయింది.. బాలీవుడ్ లో కూడా విజయ్ కి క్రేజ్ పెరిగింది.. తన రౌడీ బ్రాండ్ బట్టలతో విజయ్ మరింత పాపులర్ అయ్యారు..
విజయ్ తన కెరీర్ నీ మార్చేసిన అర్జున్ రెడ్డి తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ నీ మెప్పించేందుకు ఫ్యామిలీ సినిమాల దర్శకుడు పరశురామ్ తో “ గీతా గోవిందం “ సినిమాలో నటించాడు.. ఈ సినిమా కూడా అద్భుత విజయం సాధించింది.ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ లో సైతం విజయ్ క్రేజ్ బాగా పెరిగింది.. కానీ ఆ తరువాత నుంచి విజయ్ కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.. ఆ తరువాత తాను చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది.. విజయ్, పూరీ కాంబినేషన్ లో వచ్చిన “ లైగర్ “ మూవీకి ఊహించని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తే ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.. లైగర్ ఎఫెక్ట్ విజయ్ కెరీర్ పై బాగా పడింది..దానితో స్టార్ డైరెక్టర్స్ తో విజయ్ సినిమాలు ఒప్పుకోవడం లేదు.. విజయ్ గత ఏడాది నటించిన ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు..సమంత హీరోయిన్ గా నటించింది.
రొటీన్ స్టోరీ కావడంతో ‘ఖుషి’ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఈ ఏడాది తనకు గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన “ఫ్యామిలీ స్టార్” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది..దీనితో విజయ్ కెరీర్ నిలబడాలంటే వెంటనే ఒక భారీ బ్లాక్ బస్టర్ కావాలి.. దీనికోసం విజయ్ కూడా డిఫరెంట్ సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయ్యాడు.. దీనితో “జెర్సీ” మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.. గౌతమ్ తిన్ననూరి సినిమాలో విజయ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు..నటనకు బాగా స్కోప్ వుండే పాత్ర కావటంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ పీరియాడిక్ మూవీ విజయ్ లైనప్ లో వున్నాయి.