మళ్ళీ అదే తప్పు చేసిన కీర్తి.. ఇప్పటికైనా మారితే బెటర్?

praveen
నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో.. ఈ అమ్మడికి  వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నాని సరసన నటించి.. నేను లోకల్ సినిమా ద్వారా మరింత క్రేజ్ సంపాదించింది.  మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా వచ్చిన మహానటి సినిమాతో జాతీయ అవార్డును అందుకొని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు నేటి తరానికి సావిత్రమ్మగా మారింది కీర్తి సురేష్.

 అయితే ఏం ముహూర్తాన ఈ అమ్మడు మహానటి సినిమా చేసిందో కానీ ఆ తర్వాత నుంచి ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది కీర్తి సురేష్. మహానటి సినిమా తర్వాత తన క్రేజ్ కి తగ్గట్లుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలతో చేతులు కాల్చుకుంది. ఇక బొద్దు బొద్దుగా ఉండి ఎంతో మందిని మనసు కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ బక్కచికి పోయి ముఖంలో ఉన్న కలలు మొత్తం పోగొట్టుకుంది. ఇక ఆ తర్వాత రజనీకాంత్ చెల్లెలిగా నటించి పెద్దన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించింది  ఇక ఈ సినిమా ఎంతటి భారీ డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అయితే హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో చెల్లెలిగా చేస్తే ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తాయని తెలిసి కూడా రజనీకాంత్ సినిమాలో నటించింది. అనుకున్నట్టుగానే ఆ తర్వాత మరో చెల్లెలు పాత్ర ఆమెను పలకరించింది  మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా  నటించింది. అయితే చిరంజీవి కీర్తి సురేష్ మధ్య సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయింది. కానీ సినిమానే వర్కౌట్ కాలేదు. ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక మరి కొన్ని రోజులు ఈ సినిమా కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోయాయ్. చివరికి ఫ్లాప్ గానే మిగిలే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: