అలాంటి ప్రశ్నకు క్రేజీ ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్....!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కమలహాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ప్రస్తుతం శృతిహాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా తో కలిసి ముంబైలోనే ఒక అపార్ట్మెంట్ లో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో శృతిహాసన్ తరచూ అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ, విచిత్రమైన ప్రశ్నలు వేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. కాగా తాజాగా కూడా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తుండగా కొన్ని వింతైన ప్రశ్నలు ఆమెకి ఎదురయ్యాయి
కొందరు నెటిజన్లు అడిగిని కొంటె ప్రశ్నలకు శృతి కూడా అంతేక్రేజీగా సమాధానం ఇచ్చింది. అయితే ఈ సారి ఫోటోలకు సంబంధించిన క్యూ అండ్‌ ఏ జరిగింది.ఇందులో చిన్నప్పటి ఫోటో పెట్టమని ఒకరు, రెడ్‌ డ్రెస్‌లో ఫోటోని పంచుకోమని, బాయ్‌ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోని షేర్‌ చేయమని, ఇలా రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో భాగంగా ఒక నెటిజన్‌ వింతైన ప్రశ్న అడిగాడు. తన పాదాల ఫోటో చూపించమన్నాడు. దీనికి షాక్ అయిన శృతి ఒక క్రేజీ ఫోటో వదిలింది.అది ఒక వింత జంతువో లేక, ఏలియన్‌ కాళ్లో తెలియదు కానీ చాలా వింతంగా ఉన్నాయి. ఆ దెబ్బకి నెటిజన్‌కి దిమ్మతిరిగిపోవడం విశేషం. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదే కాదు ఇంకా విచిత్రమైన, పర్సనల్‌ క్వచ్ఛన్స్ కూడా ఎదురయ్యాయి.ఆయా ప్రశ్నలను సైతం ఆమె ఇన్ స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అయితే శృతిహాసన్ చేసిన పనికి అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో మా హీరోయిన్ కి బాగా తెలుసు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు అడిగిన ప్రశ్నలకు కూల్ గానే సమాధానం చెప్పింది శృతిహాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: