పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కాంతి పై సముద్రఖని వ్యాఖ్యలు !
ఈవారం చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ లేకపోవడంతో ‘బ్రో’ 100 కోట్ల మార్క్ అందుకోవడం అంత కష్టం కాదు అన్న అంచనాలు వస్తున్నాయి. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సముద్రఖని ఈసినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ ఏర్పడిన ఒక కాంతి వలయం తన దృష్టికి వచ్చినట్లు చెప్పాడు. ఈసినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పవన్ ఉదయం 7 గంటలకు షూటింగ్ స్పాట్ కు వచ్చి ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం పండ్ల రసాలు వేడి నీళ్ళు పాలు మాత్రమే తీసుకుంటూ ఈసినిమాకు సంబంధించిన 21 రోజుల షూటింగ్ ను పూర్తి చేసిన విషయాన్ని బయట పెట్టాడు.
ఈసినిమా షూటింగ్ సమయంలో పవన్ చుట్టూ ఒక ఆరా {కాంతి వలయం} తనకు స్పష్టంగా కనిపించిందని అలాంటి పరిస్థితులలో పవన్ మొఖం లో తాను ఒక స్పష్టమైన కాంతిని చూశాను అని అంటున్నాడు. ఒక నటుడు దేవుడు పాత్రలో నటించడం అంత సులువైన పని కాదని అలాంటి పాత్రను ఎలాంటి టెన్షన్ లేకుండా హుషార్ గా నటించగల సమర్థత పవన్ సొంతం అని అంటున్నారు. సినిమాలలో నటిస్తే డబ్బు బాగ వస్తుందని అయితే ఒక మంచి సినిమాకు దర్శకత్వం వహించిన తృప్తి కేవలం సినిమాలో నటిస్తే రాదు అని అంటున్నాడు. చెన్నై కు జేబులో 1050 రావవపాయాలతో వచ్చిన తనకు ఇప్పుడు కోట్లు రా వడం దేవుడి దయ మాత్రమే అని అంటున్నాడు..