అవకాశాల కోసం అక్కడ సర్జరీ..నటి ఎమోషనల్ కామెంట్స్..!

Divya
సినీ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. కొన్నిసార్లు నటీనటులకు చేదు అనుభవాలు కూడా ఎదురైన సందర్భాలు ఉన్నాయి. మరి కొంతమంది ఇండస్ట్రీలో రాణించడం కోసం తమను తాము పూర్తిగా మార్చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి చేదు అనుభవాలు ఎదురైన వారిలో నటి ఆయేషా ఖాన్ కూడా ఒకరు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో జరిగిన ఒక చేదు అనుభవాన్ని తెలియజేసింది.


ఆయేషా ఖాన్ ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఒక వ్యక్తి తన ముక్కుకి సర్జరీ చేయించుకోమని చెప్పారని.. ఆ విషయం విన్న తర్వాత తాను షాక్ అయ్యానని తెలిపింది. నాకు నా ముక్కే అందము.. అలాంటిది సర్జరీ చేయించుకోమని చెప్పడంతో అతని మీద కోపం వచ్చింది. దాంతో లైఫ్ లో అతని ముందుకు మళ్లీ వెళ్లలేదు.. మరోసారి  హర్రర్ సినిమాకి ఆడిషన్ కి వెళ్ళగా అక్కడ ఒక ఫేమస్ డైరెక్టర్ తనని సెలెక్ట్ చేశారని. అప్పుడు చాలా ఆనందపడ్డాను, ఆ సమయంలోనే ఆ డైరెక్టర్ నీ పల్ల వరుస మార్చుకోమని చెప్పడంతో చాలా ఇబ్బంది పడ్డానని తెలియజేసింది అయేషా ఖాన్.

ఆయేషా ఖాన్ హిందీలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ముఖచిత్రం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాలలో నటించింది. అలాగే ఇటీవల బాలీవుడ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ధురంధర్ చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, మాధవన్ తదితర నటీనటులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా రూ .200 కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం ఆయేషా ఖాన్ చేతిలో కిస్ కిస్కో ప్యార్ కరూ 2 చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: