'దేవర' సెకండ్ హాఫ్ అంతా అతని క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందంట...!!
ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మరి తాజాగా ఈ సినిమాలో సైఫ్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఇంటర్వెల్ లో రివీల్ అవుతుంది అని ఇతడి క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉంటుందని.. సెకండ్ హాఫ్ మొత్తం ససైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని టాక్.దీంతో కొరటాల పాత్రను చాలా బలంగా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. కాగా వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అవ్వడంతో నెక్స్ట్ రాబోయే మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. ఇక యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.