మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానిస్టేబుల్ తనయుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా తన సొంత టాలెంట్ ను నమ్ముకుని ఈ స్థాయికి చేరుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు చిరంజీవి.
ప్రస్తుతం ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు. అయితే చిరంజీవి నటుడే కాదు గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ఇక ఈ విషయం చాలా సార్లు రుజువు అయింది. కూడా అలాగే తనకున్న గొప్ప మనసుతోనే చిరంజీవి చాలా సార్లు గతంలో పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేసిన సినిమాలు ఉన్నాయి. నిజానికి ఒక సినిమాకు కమిట్ అయ్యాము అంటే ఈ ఎన్నో నెలలు లేదా సంవత్సరాలకు కూడా కష్టపడాల్సి వస్తుంది. చాలా కష్టపడి నిద్రలేని రాత్రులు గడిపి చేసిన సినిమాకి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్
తీసుకోకుండా శ్రమ చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ చిరంజీవి మాత్రం అలా చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇటీవల ఆయన నటించిన సినిమాల్లో ఆచార్య సినిమా కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల చాలా నష్టం వచ్చింది. ఇక ఆ నష్టాన్ని కొంతవరకైనా పూడ్చేందుకు చిరంజీవి ముందుకు వచ్చాడు. ఆచార్య సినిమాకి తీసుకున్న రెమ్యూనిరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసారట చిరంజీవి. ఈ సినిమానే కాదు గతంలో కూడా బిగ్బాస్ మృగరాజు వంటి సినిమాలకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట చిరంజీవి..!!