స్పై సినిమా చుట్టూ ఏం జరుగుతోంది..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు యంగ్ హీరో నిఖిల్.. తాజాగా తను నటిస్తున్న స్పై చిత్రం ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కాస్త గందరగోళంగా వార్తలు వినిపిస్తున్నాయి.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కావడంతో నిఖిల్ ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. అందు చేతనే తక్కువ సమయం ఉన్నందువలన ఈ సినిమా వాయిదా వేయాలని కోరినట్లు సమాచారం.

నిర్మాత దాదాపుగా అందరికీ కమిట్మెంట్ ఇచ్చేసాను కాబట్టి ఈ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో నిఖిల్ ఈ సినిమాకు సంబంధించి కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ అలాగే రీ రికార్డింగ్ పనులు కూడా పూర్తి కాలేదు కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేయడం లేదని మీడియాకు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా డిస్ట్రిబ్యూటర్ అయితే ఈనెల 28వ తేదీన అమెరికాలో ప్రీమియర్ బుకింగ్స్ జరగబోతున్నాయి అంటూ బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేసినట్టు సమాచారం.

ఈ సినిమా నిర్మాత రాజశేఖర్ రెడ్డి సహితం జూన్ 29న రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు మరొకపక్క నిఖిల్ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తూ ఉండడంతో అభిమానులను మరొకసారి గందరగోళం నెలకొంది. మరి ఈ సినిమా విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారు చూడాలి మరి. చిత్ర బృందం ఈ విషయం పైన అధికారికంగా విడుదల చేస్తే గాని ఈ విషయంపై క్లారిటీ రాదని అభిమానులు సైతం భావిస్తున్నారు. గత ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో కార్తికేయ-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: