బాలకృష్ణతో మూవీ ఓకే అయింది... ప్రశాంత్ వర్మ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు. ఈయన "అ" అనే మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమాకు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ తో కల్కి అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా జాంబిరెడ్డి అనే మూవీ ని దర్శకుడు రూపొందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. జాంబీ రెడ్డి మూవీ విజయంతో ప్రశాంత్ వర్మ  క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింతగా పెరిగి పోయింది. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం ఒక వీడియోను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ప్రశాంత్ వర్మ తన పుట్టిన రోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూ లో ఈ యువ దర్శకుడు తన తదుపరి మూవీ కి సంబంధించిన అద్భుతమైన అప్డేట్ కు ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తాజాగా ఇంటర్వ్యూ లో బాగంగా మాట్లాడుతూ ... నేను నా తదుపరి మూవీ ని బాలకృష్ణ తో చేయబోతున్నాను. ఇప్పటికే ఆయనకు కథను వినిపించాడు. ఆయనకు కథ బాగా నచ్చింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని విషయాలు బయటకి రాబోతున్నాయి అని బాలయ్య తో సినిమా గురించి ప్రశాంత్ వర్మ తాజాగా అప్డేట్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: