శాకుంతలం రిజల్ట్స్ నన్ను చాలా బాధించింది : మధు బాల
అయితే ఆశించిన స్థాయి లో ఈ సినిమా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఈ సినిమా ఘోర పరాజయం పాలవడం తో నిర్మాతలు కూడా భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా లో మేనక పాత్రలో నటించిన నటి మధుబాల మొదటిసారి ఈ సినిమా పరాజయం పై స్పందించారు.
ఈ సందర్భం గా మధుబాల మాట్లాడుతూ..ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలందరూ ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం నాకు చాలా బాధ కలిగించిందని మధుబాల వెల్లడించారట.ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనప్పటి నుంచి సినిమా విడుదల అయ్యే వరకు ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఓ అద్భుతమై న విజువల్ ట్రీట్ ఇవ్వాలని కూడా భావించారు.ఇక ఈ సినిమా షూటింగ్ సమయం లో ఎవరికి ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతం గా షూటింగ్ జరిగిందని కూడా తెలిపారు. పురాణ కథలను ఆధారం గా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. బాహుబలి, 'ఆర్ఆర్ఆర్'.. మంచి విజయాలు అయితే అందుకున్నాయి.ఇలా ఈ సినిమాలు విజయం కావడాని కి సరైన కారణాలు ఏవి కూడా లేవని చెప్పాలి. కానీ మా సినిమా మాత్రం ఇలా తీవ్రంగా అందరిని నిరాశ పరుస్తుందని అసలు ఊహించలేదు అంటూ ఈ సందర్భం గా మధుబాల శాకుంతలం సినిమా పరాశయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.