"ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" మూవీకి అన్ని కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి నాగ శౌర్య తాజాగా ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ నిన్న అనగా మార్చి 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను కాస్త ఆకట్టు కోవడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పరవాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అలా ఈ మూవీ పై కాస్త ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 3.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఇలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా నిన్న థియేటర్ లలో విడుదల అయ్యింది.

ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ... మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం భారీ కలెక్షన్ లను వసూలు చేయడం బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త కష్టం గానే కనపడుతుంది. ఇది ఇలా ఉంటే మొదటి రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 85 లక్షల మేర గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ మొదటి రోజు 1.10 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇది ఇలా అంటే ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే ఇంకా చాలా కలెక్షన్ లను వసూలు చేయవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: