ఆ స్టార్ హీరో సినిమా వల్లే దిల్ రాజు ఈ స్థాయిని అనుభవిస్తున్నారా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతోమంది నిర్మాతలకు లైఫ్ ఇచ్చారనే సంగతి తెలిసిందే.అయితే  పవన్ సినిమాల వల్ల కోట్ల రూపాయల లాభాలను సొంతం చేసుకున్న నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు.ఇక ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలుగుతున్న దిల్ రాజు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ సినిమా ఉందనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. కాగా ఒక విధంగా పవన్ మూవీ వల్లే దిల్ రాజు ఈ స్థాయిని అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. అయితే వాస్తవానికి దిల్ రాజు ఫ్యామిలీకి ఎలాంటి మూవీ బ్యాగ్రౌండ్ లేదు. 

దిల్ రాజు ఫ్యామిలీ హైదరాబాద్ లో ఆటో మొబైల్ బిజినెస్ చేస్తూఅ ఆ బిజినెస్ ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలను అందుకునేది.ఇక  దిల్ రాజు బిజినెస్ చేసే ప్రాంతానికి సమీపంలో తెలుగు సినిమాల మూవీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉండేవి. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత వాళ్ల బాబాయి ద్వారా దిల్ రాజు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ తొలినాళ్లలో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి. అయితే ఒక కన్నడ సినిమా రీమేక్ తో ఇండస్ట్రీలో నిలబడ్డ దిల్ రాజు

పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా వల్ల ప్రస్తుతం ఈ స్థాయిని అనుభవిస్తున్నారు. ఇక ఈ సినిమా నైజాం హక్కులను 72 లక్షల రూపాయలకు దిల్ రాజు కొనుగోలు చేయగా ఈ సినిమా ఏకంగా 2.8 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇకపోతే పెట్టుబడితో పోల్చి చూస్తే ఈ సినిమా నాలుగు రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమా రిజల్ట్ తర్వాత దిల్ రాజు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. కాగా దిల్ రాజు సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: