హిందీ సినీ పక్షంలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సోనాక్షి సిన్హా ఒకరు. ఈమె సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన దబాంగ్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఒక్క సారిగా ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది.
ఆ తర్వాత కొంత కాలం పాటు ఈమె అద్భుతమైన జోష్ ఉన్న నటిగా హిందీ సినీ పరిశ్రమలో కెరియర్ ను కొనసాగించింది. కానీ ఆ తర్వాత కాలంలో ఈమె నటించిన సినిమాలు అవి పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావాన్ని చూపకపోవడంతో మెల్లి మెల్లిగా ఈమె క్రేజ్ తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ ఈమె ప్రస్తుతం కూడా అడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను పర్వాలేదు అనే స్థాయిలోనే ముందుకు సాగిస్తుంది. తాజాగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులను ఒకరు అయినటువంటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన హిరామండి అనే వెబ్ సీరీస్ లో నటించింది.
ఈ వెబ్ సీరీస్ తో తన కల నెరవేరింది అని ఈ బ్యూటీ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె మాట్లాడుతూ. నా ఎన్నో రోజుల కల హిరామండి వెబ్ సిరీస్ తో నెరవేరింది. పవర్ఫుల్ డార్క్ క్యారెక్టర్ లో నటించడం అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ హిరమండి సిరీస్ లో నేను చేశా. దానితో నా కోరిక నెరవేరింది అని ఈమె చెప్పుకొచ్చింది. అలాగే తన నాన్న శత్రుజ్ఞ సిన్హా ను స్ఫూర్తిగా చేసుకొని ఈ పాత్ర చేసినట్లు ఈమె చెప్పుకొచ్చింది. ఇక అలాగే ఈ సిరీస్ లో ఫరిదాన్ పాత్రలో తనను ఎంపిక చేసుకున్నందుకు ఈ సిరీస్ దర్శకుడు అయినటువంటి సంజయ్ లీలా భన్సాలీ కి సోనాక్షి ధన్యవాదాలు తెలిపారు.