"పటాస్" మూవీ కళ్యాణ్ రామ్ చేయడానికి ముందు ఇంత పెద్ద స్టోరీ జరిగిందా..?

Pulgam Srinivas
కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన పటాస్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసిందే . ఇక పోతే ఈ మూవీ స్టార్ట్ కావడానికి ముందు అనేక విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం . అనిల్ రావిపూడి పటాస్ మూవీ తోనే దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆయన రైటర్ గా పని చేస్తున్న సమయం లో డైరెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో పటాస్ కథను రాసుకున్నారట.

ఇక కథ మొత్తం పూర్తి అయ్యాక దరువు సినిమా సెట్స్ లో ఉన్న రవితేజ కు ఈ సినిమా కథను వివరించారట. దానితో కథ మొత్తం విన్న ఆయన కథ బాగానే ఉంది. దాదాపు ఇలాంటి కథనే వక్కంతం వంశీ దగ్గర కూడా విన్నాను. దానికి మేము అనుకున్న టైటిల్ పవర్. కానీ అప్పుడు చేయలేకపోయాను అని చెప్పారట. అలా పటాస్ స్రిప్ట్ ను రవితేజ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అనిల్ ఇదే కథను కళ్యాణ్ రామ్ కి చెప్పారట.  

ఆయన కథ మొత్తం విని , స్క్రిప్ట్ బాగానే ఉంది కానీ ప్రస్తుతం చేసే ఆలోచన లేదు అని చెప్పారట. దానితో ఆయన ఏమీ చేయలేక ఈ కథను మరో ఇద్దరు ముగ్గురు హీరోలకు వినిపించారట. ఎవరితోనూ సెట్ కాలేదు. ఇక చివరకు కళ్యాణ్ రామ్ నీ మళ్ళీ కలిసి ఈ సినిమా చేయండి సార్ మీకు బాగా సెట్ అవుతుంది అని అన్నారట. ఇక కళ్యాణ్ కూడా ఇతను ఇంతలా అడుగుతున్నాడు సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేశాడట. అలా కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన పటాస్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kr

సంబంధిత వార్తలు: