శోభన్ బాబు ఆరాధించే ఏకైక నటుడు ఎవరో తెలుసా..??
ఈ సందర్భంగా శోభన్‌బాబు ఆరాధించే నటుడు ఎవరో తెలిపారు కృష్ణంరాజు. ఆయన కొడంబాకంలో ఉన్నప్పుడు ఓ రోజు ఇంటికి వెళ్లాడట కృష్ణంరాజు. అప్పటికే శోభన్‌బాబు పది పదిహేను సినిమాలు చేశారు. హీరోగా నిలబడుతున్నాడు. ఇంటికెళ్లినప్పుడు ఆయన హాల్లో కూర్చొని ఉన్నారు. టీవీ చూస్తున్నారట. ఇంట్లో వెళ్లగా, ఎదురుగా పెద్ద బొమ్మ ఉందట. అది ఎన్టీ రామారావు ఫోటో. రామారావు అంటే ఆయనకు అంతటి ప్రేమ, అభిమానం. ఇంట్లో ఓ దేవుడి ఫోటో పెట్టుకున్నట్టుగా రామారావు ఫోటో పెట్టుకునేవారు శోభన్‌బాబు అని తెలిపారు కృష్ణంరాజు.ఈ సందర్భంగా శోభన్‌బాబు డబ్బుకి ఇచ్చే ప్రయారిటీ గురించి బయటపెట్టారు కృష్ణంరాజు. ఆయన్ని అంతా పిసినారి అంటారు. కానీ ఆయన నిజానికి పిసినారి కాదు. డబ్బు ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చుపెట్టాలో తెలుసు. అనవసరంగా ఖర్చు చేయరు. అవసరం ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు చేస్తారు. ఓ రోజు హైదరాబాద్‌లో ఫంక్షన్ కోసం మద్రాస్ నుంచి వచ్చినప్పుడు వచ్చిన దగ్గరి నుంచి వెళ్లిపోయేంతటి వరకు అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు. నా చేత ఒక్క రూపాయి కూడా పెట్టనివ్వలేదు. అలాంటి మంచి మనిషి శోభన్‌బాబు అని వెల్లడించారు కృష్ణంరాజు.అలాగే సంపాదన గురించి చెబుతూ, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేసి, పొలాలు కొనాలని చెప్పేవారు. ఆయన ఇండస్ట్రీకి చేశాను, అందరికి చేశాడు, తన ఫ్యామిలీకి చేశాడు, తను కూడబెట్టుకున్నాడు. తను నాలుగు రోజుల్లో చనిపోతాడనగా, నాకు ఫోన్ చేసి అరేయ్ వచ్చి వెళ్లిపోతున్నాను, ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండాలి రా అన్నాడట. ఓ రోజు ఢిల్లీ నుంచి దిగుతుంటే ఎయిర్ పోర్ట్ లో ఫోన్ వచ్చింది. చెప్పడానికి అతను భయపడ్డాను, వినడానికి నాకు భయమేసింది, విని తట్టుకోలేకపోయాను` అని వెల్లడించారు కృష్ణంరాజు. శోభన్‌బాబు పేరిట అందించిన అవార్డు ఫంక్షన్లో కృష్ణంరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.