"డబల్ ఈస్మార్ట్" ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ అదే..?

Pulgam Srinivas
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో నిధి అగర్వాల్ , నబా నటేష్ హీరోయిన్ లుగా నటించగా , మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు . ఈ మూవీ కి మణిశర్మ అందించిన మ్యూజిక్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం తో ఈ మూవీ విజయం లో ఈయన అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది.

ఇక ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపు గా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగం షూటింగ్ పూర్తి అయింది. ఇందులో సంజయ్ దత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క మొదటి పాటను మే 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకు కూడా మని శర్మ సంగీతం అందిస్తున్నాడు. దానితో ఈ మూవీ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: