పల్నాడు : పౌరుషాల గడ్డపై వీరులెవరు..?

FARMANULLA SHAIK
* మెజారిటీ దిశగా టీడీపీ నేతలు గెలిచే అవకాశం
* నరసరావుపేట పార్లమెంట్ సీట్ వరించేది ఆ పార్టీకే

పల్నాడు - ఇండియా హెరాల్డ్ : చిలకలూరి పేట నియోజకవర్గంలో స్పష్టమైన మార్పు అనేది కనిపిస్తోందన్నది అక్కడ ప్రజల మాట.క్షేత్రస్థాయిలో టీడీపీ అభ్యర్థి అయినా పుల్లారావుకు లభిస్తున్న ఆదరణ, టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్‌, పుల్లారావు కుటుంబానికి దక్కుతున్న సింపతీ వంటివి ఆ పార్టీకి బాగా ప్లస్‌గా మారాయి. ఇక, వైసీపీలో సమన్వయ లోపం, నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు వంటివి ఆ పార్టీకి తీరని లోటుగా మారాయి.
సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు బరిలో ఉండగా టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగడంతో ఈసారి ఇక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది. పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబటి రాంబాబుకు తాజా ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు చాలా ఉన్నాయంటూ రాజకీయా విశ్లేషకులు అంటున్నారు.
వినుకొండ నియోజకవర్గంలో వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పోటీచేస్తుండగా టిడిపి అభ్యర్థిగా జి.వి.ఆంజనేయులు పోటీలో ఉన్నారు.ఈసారి వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోపాటు తాను చేసిన సేవాకార్యక్రమాలు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జనరావు మద్దతు తనను గెలిపిస్తాయని జి.వి.ఆంజనేయులు అంటున్నారు.అక్కడి ప్రజలు కూడా టీడీపీవైపే మొగ్గు చూపుతున్నాయంటూ విశ్లేషకులు అంటున్నారు.
పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు.గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మెజార్టీ పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల మరియు తాను చేసిన అభివృద్ధి వల్లే అది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.అలాగే టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ కూడా ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో మామ శంకరరావు పై దూకుడు పెంచుతున్నాడు.అక్కడ సైకిల్ స్పీడ్ మీద ఉన్నట్లు తెలుస్తుంది.
గురజాలలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు కి అలాగే వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి మధ్య యుద్ధం నడుస్తుంది అన్నట్లు అక్కడి రాజకీయం ఉంది. అయితే వైసీపీ పై అసంతృప్తి కారణంగా ఈసారి కాసు వెనుకంజలో ఉన్నట్లు అక్కడి సర్వేలో తేలింది.మాచర్లలో కులా పోటీ బాగా రసవత్తరంగా ఉంది.టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి vs వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మధ్య జరిగే హోరులో అక్కడి ప్రజలు పిన్నెల్లిపై మొగ్గుచూపే పనిలో ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.నరసరావుపేట నియోజకవర్గ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు vs వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మధ్య పోరు జోరు మీద ఉన్నట్లు తెలుస్తుంది.ఈసారికూడా శ్రీనివాస రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడతున్నాయి.
అలాగే నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి వస్తే నాన్ లోకల్ అభ్యర్థి,మాజీ మంత్రి అయినా అనిల్ కుమార్ యాదవ్ కు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అలాగే గత ఎన్నికల్లో వైసీపీ నుండి ఎంపీ గా గెలిచినా లావు ఈసారి టీడీపీలో చేరి మరలా అక్కడనుండే టికెట్ పొంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ కింద ఉన్న పై నియోజకవర్గ ప్రజలు మరలా లావు నే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: