"రాజా ది గ్రేట్" మూవీ కి మొదటగా అనుకున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ హీరోగా మెహరీన్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన "రాజా ది గ్రేట్" సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి మొదట ఈ సినిమాకు రవితేజను కాకుండా మరో ఇద్దరు హీరోలను అనుకున్నారట. వారు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా రవితేజకు వచ్చింది.

మరి ఆ హీరోలు ఎవరు..? ఎందుకు ఈ మూవీ ని రిజెక్ట్ చేశారు అనే వివరాలను తెలుసుకుందాం. దర్శకుడు అనిల్ రావిపూడి మొదట ఈ కథను ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఊహించుకొని రాశారట. కథ మొత్తం పూర్తి అయిన తర్వాత రామ్ కి ఈ కథను వినిపించారట. దానితో ఆయన కథ సూపర్ గా ఉంది. కాకపోతే ప్రస్తుతం అన్ని కమర్షియల్ సినిమాలే చేస్తున్నాను. మరో కమర్షియల్ సినిమా అంటే జనాలు దీనిని ఎలా తీసుకుంటారో..? అందుకని ఇప్పుడు ఈ సినిమా చేయలేను అని చెప్పారట. దానితో చేసేది ఏమిలేక ఇదే కథ ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించాడట. ఆయన ప్రస్తుతం చాలా సినిమాలను ఓకే చేసి ఉన్నాను. ఈ సినిమా కథ బాగుంది.

కాకపోతే ఈ సినిమా ను నేను ఓకే చేసిన సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. అన్ని రోజుల్లో నువ్వు వెయిట్ చేయడం కూడా కష్టం. అందుకని ఎప్పుడైనా చూద్దాం అని చెప్పారట. దానితో అనిల్ ఇదే కథను పట్టుకొని రవితేజ వద్దకు వెళ్లారట. దానితో అనిల్ చెప్పిన మొత్తం కథను విన్న రవితేజ వెంటనే ఈ మూవీ ని ఓకే చేశాడట. దానితో ఈ సినిమా "రాజా ది గ్రేట్" అనే టైటిల్ తో తెరకెక్కడం , విడుదల కావడం , బ్లాక్ బస్టర్ కావడం జరిగిపోయింది. ఇలా రామ్ మరియు ఎన్టీఆర్ లు రిజెక్ట్ చేసిన స్టోరీ తో రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: