సుడిగాలి సుదీర్ తో.. 'ఆహా' కొత్త ప్లాన్.. జబర్దస్త్ కి షాకిస్తుందా?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. దాదాపు 10 ఏళ్ళ నుంచి కూడా ప్రేక్షకులందరికీ ఎప్పటికప్పుడు వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమం ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతోమంది కమెడియన్స్ కి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశాలు ఇచ్చింది అని చెప్పాలి. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించిన వారు. ఇక ఇప్పుడు సినిమాల్లో వరుస అవకాశాలు సంపాదిస్తూ బిజీ బిజీగా ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా జబర్దస్త్ షో ద్వారా ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అటు సుడిగాలి సుదీర్ కూడా ఒకరు అని చెప్పాలి. ఏకంగా బుల్లితెరపై స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్ కి అమ్మాయిల్లో ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువే ఇక అతనికి ఉన్న ఫాలోయింగ్ క్యాష్ చేసుకొనేందుకు అన్ని చానల్స్ కూడా ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అయితే జబర్దస్త్ నుంచి తప్పుకున్న సుడిగాలి సుదీర్ మాటీవీలో ఒక కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు. కానీ అక్కడ కూడా కలిసి రాకపోవడంతో ప్రస్తుతం సుదీర్ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది.  కానీ ఇప్పుడు మాత్రం సుధీర్ ఒకసారి కొత్త కామెడీ షో ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.



 ఇటీవల కాలంలో తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ అయిన ఆహా సరికొత్తగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచేందుకు కార్యక్రమాలను సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షో ద్వారా ఆహా ఓటిటి వేదికగా సుధీర్ యాంకరింగ్  చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎన్ని షోలు వచ్చినా జబర్దస్త్ కూ పోటీ ఇవ్వలేకపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్ నూ దెబ్బతీయాలని ఉద్దేశంతోనే ఆహా సరికొత్త కామెడీ షో తో రంగంలోకి దిగేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇక ఈ షో కి అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించబోతున్నాడట. ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కమెడియన్స్ అందరూ కూడా ఇందులో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: