మరోసారి తెరపైకి వచ్చిన పవన్ కళ్యాణ్... సుజిత్ మూవీ..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర అద్భుత మైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత వినోదయ సీతం అనే తమిళ్ రీమేక్ మూవీ లో కూడా పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది  అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ లో నటించడానికి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యాడు. అలాగే టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటించడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇలా ఇప్పటికే వరస మూవీ లను లైన్ లో పెట్టి ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ 'సాహో' మూవీ దర్శకుడు సుజిత్ తో ఒక మూవీ చేయబోతున్నట్లు గతంలో కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మరో సారి పవన్ కళ్యాణ్ ,  సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: