మహేష్ పైనే ఆశలు పెట్టుకున్న బుట్టబొమ్మ!!
రీసెంట్ గా ఆమె నటించి రిలీజ్ అయిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ కావడమే కాకుండా ఆమెకు అవి ఏమాత్రం కూడా పేరు తీసుకురాలేకపోయాయి. అయితే తన ఈ పరిస్థితి గురించి ఆమె మాట్లాడింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ వరుస ఫ్లాప్ లు రావడం తనకు ఈ పరిస్థితి ని తెచ్చి పెట్టిందని చెప్పింది. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలవైకుంఠపురం లో సినిమా లోని పాత్ర తనకు మంచి పేరు తెచ్చింది అని చెప్తుంది. ఇప్పుడు కొన్ని మంచి సినిమాలు చేస్తున్నానని చెప్పింది. తప్పకుండ మళ్ళీ కం బ్యాక్ చేస్తానని చెప్తుంది.
మహేష్ తో చేయబోయే సినిమా తనకు ఎంతో కీలకం అని చెప్పింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే మహేష్ సినిమాలో తన పాత్ర బాగుంటుందని చెప్పింది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుందని చెప్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతుంది. ఏప్రిల్ 28 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గత మూడు సినిమాలుగా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడతాయా అనేది చూడాలి. ఇవే కాకుండా కొన్ని ఇతర భాషల సినిమాలలో కూడా ఈమె హీరోయిన్ గా నటించబోతుంది.