అలనాటి దర్శకులలో ప్రేక్షకులను ఎంతగానో అలరించే సినిమాలు చేశాడు మణిరత్నం. సినిమా కెరియర్ను ప్రారంభించి చాలా రోజులే అవుతున్నా కూడా ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరించే సినిమాలు చేయడం విశేషం. ఇప్పుడు ఆయన ఒక భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే పొన్నియన్ సెల్వన్. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సిద్ధమైన నేపథ్యంలో ఈ సినిమా ఆయన గత సినిమా లాగా భారీ విజయాన్ని అందుకుంటుందా అనేది ఇప్పుడు అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.
తమిళనాడు లో బాహుబలి సినిమా రేంజ్ లో రూపొందిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకోవాలని ప్రతి ఒక్క సినిమా అభిమాని కూడా భావిస్తున్నాడు. ఇలాంటి సినిమాలు తెరపైకి వస్తేనే భవిష్యత్తులో ఇండియన్ సినిమా యొక్క సత్తా ప్రపంచానికి చాటి చెప్పినట్లు అవుతుంది అనేది వారి ఆలోచన. ఎలాంటి నెగెటివిటీ లేకుండా ప్రేక్షకుల ముందుకు ఈ చారిత్రాత్మక సినిమా రాబోతున్నాడు. విక్రమ్ జయం రవి కార్తీ వంటి భారీ హీరోలు ఈ సినిమాలో నటిస్తూ ఉండగా ఐశ్వర్య రాయ్ త్రిష శోభిత దూళిపాల వంటి అందాల భామలు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
కథా కథనాల పరంగా మణిరత్నం ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. టేకింగ్ పరంగా కూడా ఆయన మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆయన టేకింగ్ నచ్చే ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంది. తొందర్లోనే దీనికి సంబంధించిన విడుదల జరగబోతున్న నేపథ్యంలో ఆ సినిమా మెజారిటీ ప్రేక్షకులకు నచ్చుతుందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అనే చెప్పాలి. చాలా సంవత్సరాలుగా అయన ఈ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేయగా అది ఇప్పుడు సఫలీకృతం అయ్యింది అని చెప్పాలి.