ప్రభాస్ 'ఆదిపురుష్' మళ్ళీ మొదలైన అనుమానాలు..?

Anilkumar
తాజాగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆదిపురుష్' .ఇదిలావుంటే ఇక ఈ చిత్రంపై రోజుకో రకంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.అయితే  రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌ని దసరాకి విడుదల చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక దీంతో.. ఎప్పటి నుండో ఈ సినిమా అప్‌డేట్ కోసం వేచి చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. 'ఆదిపురుష్'కి సంబంధించిన ట్యాగ్‌ని ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు.  ఇప్పుడు మళ్లీ వ్యవహరం మొదటికి వచ్చినట్లుగా తెలుస్తుంది.


ఇక అందుకు కారణం ఏమిటంటే.. దసరాకి ఫస్ట్ లుక్, టీజర్ అనే విషయం సోషల్ మీడియాలో రావడమేగానీ.. మేకర్స్ సైడ్ నుండి మాత్రం ఇంత వరకు అధికారికంగా ఎటువంటి అప్‌డేట్ రాలేదు. అయితే దీంతో దసరాకి కూడా 'ఆదిపురుష్' ఆగమనం కష్టమే అంటూ.. మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాదు అలాగే టీజర్‌కు సంబంధించి ప్రభాస్‌తో ప్రత్యేక షూట్ చేయించాలని.. ఓం రౌత్ భావించగా.. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక నెల వరకు షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వడం కూడా ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు.


అయితే  కారణాలు ఏమైనా గానీ, 'ఆదిపురుష్' అప్‌డేట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్న అభిమానులకు మాత్రం ఇది నిరాశ కలిగించే వార్తే.ఇక ఈ వార్తలు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం.. 'ఆదిపురుష్'పై ఉన్న క్రేజ్ మొత్తం పోవడం ఖాయం. సినిమా షూటింగ్ పూర్తయిందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నా.. ఇంత వరకు ఎటువంటి అప్‌డేట్ వదలకపోవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇప్పుడు అప్‌డేట్ వస్తుందనే ఆనందంలో ఉన్న సమయంలో.. మళ్లీ ఇలాంటి వార్తలు.. వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తాయి. ఇక ఆ ప్రభావం కచ్చితంగా సినిమాపై పడే అవకాశం ఉంటుంది.కాబట్టి  మేకర్స్ త్వరలో ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే బెటర్.. లేదంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికాక తప్పదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: