ఆషికి 3 లో ఛాన్స్ కొట్టేసిన రష్మిక...?

murali krishna
గ్లామర్ బ్యూటీ అయిన రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో ప్రేమతో అభిమానంగా పిలుచు కుంటారు. ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి కూడా తెలుసు.


అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్ల మెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయిందట.. ఈ మధ్యనే దుల్కర్ సల్మాన్ సీతా రామం లో కూడా అతిథి పాత్రలో ఆమె మెరిసింది. ఈ సినిమా లో ఈమె కీలక పాత్ర పోషించి నటిగా తనని తాను మరోసారి నిరూపించుకుంది. ఇక ప్రెసెంట్ రష్మిక చేతిలో మిషన్ మజ్ను మరియు గుడ్ బై, తో పాటు తెలుగులో పుష్ప 2, వంశీ పైడిపల్లి, విజయ్ సినిమా కూడా ఉన్నాయి.చేతి లో ఇన్ని సినిమాలు ఉన్న కూడా ఇంక కొత్త కొత్త అవకాశా లు ఆమె కు వరిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా ప్రోజెక్టుల కోసం ఈ అమ్మడి పేరు వినిపిస్తుంద ట. తాజాగా మరొక బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ కోసం ఈ అమ్మడి పేరు వినిపిస్తుంది. ఆషిఖి, ఆషిఖి 2 బాలీవుడ్ లో పెద్ద సక్సెస్ అవ్వడమే కాకుండా యువతరాన్ని ఎంతో బాగా ఆకట్టు కున్నాయి..


  ఇక ఇప్పుడు ఆషిఖి 3 కోసం సన్నాహా లు కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో అని బాలీవుడ్ ప్రేక్షకు లు సైతం ఎదురు చూస్తున్నారు.. అయితే ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించగా ఇప్పుడు రష్మిక పేరు వినిపిస్తుంది.. దీంతో ఈ సినిమా అవకాశం అందుకుంటే ఇక ఈమె బాలీవుడ్ లో పాతుకు పోయినట్టే అని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: