ఒకే ఒక జీవితం: శర్వానంద్ డబుల్ ధమాకా..!!

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో అయిన శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే మహానుభావుడు'  చిత్రం తర్వాత మళ్ళీ అలాంటి హిట్టు కోసం కిందా మీదా పడ్డాడు శర్వానంద్ . ఈయనకి వరుసగా ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేశాయి.ఇక  ఎలాంటి హీరోకైనా ఆరు ఫ్లాపులంటే.. ఇమేజ్ బాగా డ్యామేజ్ అయినట్టే లెక్క.ఇకపోతే  శర్వా కు మాస్ ఇమేజ్ లేకపోవడం వల్ల అతడి మార్కెట్ బాగా దెబ్బతిని తర్వాత సినిమాలకు బిజినెస్ జరగని పరిస్థితి తలెత్తింది.ఇక  ఇంకో ఫ్లాప్ పడితే చాలు.. శర్వానంద్ టాలీవుడ్ నుంచి తెరమరుగవ్వాల్సిందే. అయితే అలాంటి టైమ్ లో శర్వానంద్ కెరీర్ లో అత్యంతావశ్యకమైన హిట్ గా 'ఒకే ఒక జీవితం'  నిలిచిపోయింది.


ఇదిలావుంటే నిజానికి శర్వానంద్ గత చిత్రాల రిజల్ట్ వల్ల 'ఒకే ఒక జీవితం' కు విడుదలకు ముందు సరైన బజ్ క్రియేట్ అవలేదు.అంతేకాదు  అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్దగా లేవు. అయితే మార్ని్ంగ్ షోస్ కు జనం లేక చాలా వరకూ థియేటర్స్ ఖాళీగా కనిపించాయి. ఇక ఎప్పుడైతే సినిమాకి చాలా బాగుందనే టాక్ వచ్చిందో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. శని, ఆదివారాల్లో సినిమా మంచి ఆక్యుపెన్సీతో నడిచింది.ఇక ఈ  వరస చూస్తుంటే.. మరిన్ని రోజులు సినిమా థియేటర్స్ లో నిలబడి భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తానికి శర్వాకి ఈ టైమ్ లో రావాల్సిన సక్సెస్ 'ఒకే ఒక జీవితం' సినిమాతో దక్కినట్టే.


కాగా ఈ సినిమాతో అతడికి ఇంకో దారిలో మరో సక్సెస్ కూడా దక్కినట్టైంది.ఇకపోతే కోలీవుడ్ లో కూడా 'ఒకే ఒక జీవితం' విడుదలైంది. ఇక 'కణం' పేరుతో వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా డల్ గానే మొదలైంది. ఇదిలావుంటే తొలిరోజు సాయంత్రానికి పుంజుకుంది.ఇక  ఇప్పుడు బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులేస్తోంది.అయితే  శర్వా చాలా ఏళ్ళ క్రిందటే 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' అనే మూవీతో తమిళనాట ఎంట్రీ ఇచ్చి హిట్టు కొట్టాడు.ఇక  అదే సినిమా తెలుగులో 'జెర్నీ'  గా విడుదలై ఇక్కడ కూడా అదరగొట్టింది.అయితే  ఆ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇకపోతే కొంచెం గ్యాప్ తర్వాత చేరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తే అది పే ఫర్ వ్యూ పద్ధతిలో విడుదలైంది.  దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత చాలా ఏళ్ళకు ఇప్పుడు కణం మూవీతో అక్కడ మంచి హిట్ కొట్టాడు.అయితే  మొత్తానికి శర్వా సినీ జీవితాన్ని 'ఒకే ఒక జీవితం' నిలబెట్టిందన్నమాట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: