నాగచైతన్య, సమంత జంట అంటే తెలియని వారుండరు..వీరిద్దరూ అనుకోని కారణాల చేత గత ఏడాది విడిపోతున్నట్లుగా ప్రకటించారు.ఇక దీంతో వీరి అభిమానుల సైతం ఈ విషయం విన్న తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటనే విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్నది. ఆలా విడిపోయిన తర్వాత సమంత, నాగచైతన్య ఎవరిదారిలో వారు పయనిస్తూ ఉన్నారు. సమంత కెరియర్ పరంగా ప్రస్తుతం బాలీవుడ్ పైన దృష్టి పెట్టింది. ఇక తర్వాత హాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.
నాగచైతన్య కూడా లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన చేసినప్పటి నుంచి వీరు ఇరువురు కుటుంబాలు కూడా ఎప్పుడు ఈ విషయంపై స్పందించలేదు.ఇదిలావుంటే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు.. తన సోషల్ మీడియాలో ఇలా రాసుకోస్తు.. సమంత, నాగచైతన్య విడిపోయారని తెలిసినప్పుటి నుంచి నా మైండ్ బ్లాక్ అయిందని తెలియజేశారు.అయితే త్వరలోనే అన్ని పరిస్థితులు సర్దు మునుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు.అంతేకాదు వీరిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తను చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలియజేశారు.
ఇకపోతే సమంత నాగచైతన్య అంటే తనకు చాలా ఇష్టమని వారితో గడిపిన కాలాన్ని మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోవదని తెలియజేశారు. సమంత నాగచైతన్యాలు వివాహానికి సంబంధించి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేశారు.వాటితో పాటు సమంత, నాగచైతన్య విడిపోయిన వీరిద్దరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నట్లుగా మరికొన్ని పోస్ట్ చేసినట్లు సమాచారం.ఇక దీన్ని బట్టి చూస్తే సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇద్దరి కుటుంబాలకి నచ్చలేదని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చేసిన పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.ఇక సమంతా ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి వంటి సినిమాలతో బిజీగా ఉండగా.. నాగచైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా తెరకెక్కనుంది.!!