విజయ్ సేతుపతి అంటే ఎందుకంత క్రేజ్..!!

P.Nishanth Kumar
కొంతమంది నటులు ఏ భాషలో నటించకపోయిన కూడా వారికి క్రేజ్ భారీ స్థాయిలో ఉంటుంది. ఆ విధంగా తమిళంలో అగ్ర నటుడుగా ఉన్న విజ య్ సేతుపతి తెలుగులో నటించక ముందే మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ విధంగా విజయ్ సేతుపతి విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ గా నిలుస్తూ ఇప్పుడు తెలుగులో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఏ తరహా పాత్రకైనా ప్రాణం పోస్తూ దానికి 100% న్యాయం చేసే నటలలో విజయ్ సేతుపతి మొదటి వరుసలో ఉంటాడని ప్రత్యేకంగా చెప్పవచ్చు .
అయితే ఆయన హీరోగా చేస్తున్న చిత్రాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ఎక్కువగా విలన్ పాత్రలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద సినిమాలలో విలన్ పాత్రలకు ఆయనే మొదటి ఆప్షన్ గా నిలుస్తూ ఉండడం విశేషం. తాజాగా తెలుగులో ఆయనకు అవకాశాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉప్పెన సిని మా తో అలరించిన ఆయన పుష్ప రెండో భాగం సినిమాలో విలన్ గా ఎంపిక అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  కమలహాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో ఆయన విలన్ గా నటించాడు .
ఆ చిత్రంలో ఆయన చూపించిన విలనిజానికి ప్రేక్షకులందరూ ఎంతగానో ముగ్దలైపోయారు. ఇప్పుడు పుష్ప సినిమాతో రాబోయే ఈ విజయ్ సేతుపతి పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి .ఇక బాలీవుడ్ లో కూడా ఆయన షారుఖ్ తో తలబడబోతున్నాడు. జవాన్ సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప రెండవ భాగం సినిమాను త్వరలోనే మొదలుపెట్టడానికి చిత్ర బృందం సిద్ధమైపోతుంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక హీరోయిన్ గా రాబోతున్న ఈ సినిమాలో విలన్ పాత్ర తర్వాత ఆయనకు పెద్ద సినిమాల అవకాశాలు అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగులో అయనమెయిన్ లీడ్ గా కొన్నిసినిమాలు తెరకెక్కడానికి రంగం సిద్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: