అమీర్ ఖాన్ Vs అక్షయ్ కుమార్.. ఏకంగా 15 ఏళ్ల తర్వాత..?

Anilkumar
తాజాగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ మధ్య మరోసారి వార్ జరగనుంది. అయితే 1994లో సుహాగ్, అందాజ్ అప్నా అప్నా, తర్వాత 2007లో వెల్కమ్, తారే జమీన్ పర్ సినిమాలతో బాక్సాఫీస్ ముందు తలపడిన అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ 15 ఏళ్ల తర్వాత  మళ్ళీ మరో బిగ్ ఫైట్ కి రెడీ అయ్యారు.అయితే వరస ఫ్లాపుల తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తోన్న కామెడి డ్రామా రక్షబంధన్. ఇక ఆత్రంగిరే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలోనే వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపైన చాలా ఆశలు పెట్టుకున్నారు అక్షయ్ కుమార్.

అయితే లాస్ట్ ఇయర్ నవంబర్ 5న రిలీజ్ కావాల్సిన రక్షాబంధన్ కోవిడ్ కారణంగా షూటింగ్ డిలే అవడంతో ఈ ఇయర్ ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతుంది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రయిలర్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ, సినిమా పైన అంచనాలు పెంచుతోంది.ఇదిలావుంటే సేమ్ డేట్ లో ఆగస్టు 11న అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తో పాటు, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కూడా రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది.ఇకపోతే  1994 లో వచ్చిన ఫారెస్ట్ గంప్ కి ఇది రీమేక్ అయినా కూడా అమీర్ ఖాన్ ఇమేజ్ కి, ఇండియన్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు మార్పులు చేర్పులతో ..తాజాగా అద్వైత్ చందన్ తెరకెక్కించిన అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కింది లాల్ సింగ్ చద్దా.అయితే  మొదట 2020 క్రిస్మస్ కి రిలీజ్ చేద్దామనుకున్నా కోవిడ్ కారణంగానే షూటింగ్ కి బ్రేక్ పడింది.

ఇక దాంతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కాగా  ఈ సినిమాలో మన నాగచైతన్య స్పెషల్ క్యారెక్టర్ చేయడం విశేషం.అయితే కోఇన్సిడెంట్ గా అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ రెండు కామెడి జోనర్ మూవీస్ ఒకే డేట్ న రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ ముందు ఈ రెండిటి మధ్య బిగ్ ఫైట్ తప్పేలా లేదంటూ బాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అయితే వరసగా ఆరు ఫ్లాపుల తర్వాత పక్కా ప్లానింగ్ తో హీరో అక్షయ్ కుమార్ నుంచి వస్తోన్న రక్షాబంధన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అయిన అమీర్ ఖాన్ నుంచి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న లాల్ సింగ్ చద్దా మధ్య జరగబోయే వార్ లో ఏ సినిమా ఏరేంజ్ లో విజయం సాధిస్తుందో.... చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాలీవుడ్ ఆడియన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: