ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు ప్రచారాలు ఆ తర్వాత నామినేషన్లు ఆ తర్వాత విత్ డ్రా లు ఇలా ఎన్నో డ్రామాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఏపీలో ఎలక్షన్స్ చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎలక్షన్స్ జరగడం రిజల్ట్ రావడమే తరువాయిగా మిగిలింది. అంటే ఈ పట్టణంలో రాష్ట్రంలోని 65-42-37-32-22-19 ఈ అంకెల చుట్టే రాష్ట్ర ప్రజల చూపే కాకుండా దేశ ప్రజల చూపు కూడా పడింది. ఈ అంకెలకు రాష్ట్ర ఎన్నికలకు సంబంధం ఏంటి అనే విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కీలకంగా ఉన్నది ఈ నియోజకవర్గాల అభ్యర్థుల మీద మాత్రమే.
ఇందులో ముఖ్యంగా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొడుకు లోకేష్, షర్మిల, జగన్, బాలకృష్ణ, పురందేశ్వరి ఇంకా కొన్ని నియోజకవర్గాలపై రాష్ట్ర ప్రజలు చూపే కాకుండా దేశ ప్రజలు చూపు కూడా పడింది. ఇదే తరుణంలో ఈ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 3084 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 4265 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 25 పార్లమెంటు స్థానాల్లో 555 మంది నామినేషన్లు వేయగా 747 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గం నుంచి మొత్తం 65 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
దీని తర్వాత వైయస్ షర్మిల బరిలో ఉన్న కడప లోక్ సభ స్థానం నుంచి 42 మంది, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల నుంచి 37 మంది, ఆ తర్వాత కుప్పం చంద్రబాబు స్థానం నుంచి 32 మంది, అలాగే రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న పురంధరేశ్వరి స్థానం నుంచి 22 మంది, ఆ తర్వాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న హిందూపురం, పిఠాపురం నుంచి 19 మంది నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఏపీ మొత్తంలో ఈ కీలక స్థానాల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు వేశారట. నామినేషన్ వేసే తేదీ ముగిసింది కానీ ఉపసంహరణ తేదీ ముగియలేదు. ఈ ఉపసంహరణ సమయంలో ఎవరైనా ఈ నామినేషన్లను ఉపసంహరించుకుంటారా లేదంటే అలాగే కొనసాగుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.