నేడే విడుదల: విశాల్ రత్నం మూవీ ఎలా ఉందంటే..?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో 'భరణి' 'పూజా' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత భారీ అంచనాలతో రూపొందిన సినిమా 'రత్నం'(తమిళ్ లో 'రత్తం').సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో మొదటి నుండి ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. వరుస ప్లాపుల్లో ఉన్న విశాల్ కి ఈ సినిమా మళ్ళీ పాత రోజులని తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావించారు. ఇక జీ స్టూడియోస్‌తో పాటు ‘స్టోన్ బెంచ్ ఫిల్మ్స్’ బ్యానర్ల పై కార్తికేయన్ సంతానం ఈ మూవీని నిర్మించడం జరిగింది. తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో కోలీవుడ్ లో తన అందంతో యూత్ ని ఫిదా చేస్తున్న యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ నటించింది. అలాగే సముద్రఖని వంటి పెద్ద స్టార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా రూపొందిన ‘రత్నం’ మూవీ ఏప్రిల్ 26 వ తేదీన అంటే ఈరోజు రిలీజ్ అయ్యింది.ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ సినిమా చూసిన ప్రేక్షకులు X ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ అయితే హాఫ్ డీసెంట్ గా ఉందని సమాచారం. అయితే తమిళ వాసన కొట్టే కామెడీ, యాక్షన్ ట్రాక్స్ మాస్ ఆడియన్స్ ని లేదా టార్గెటెడ్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి అని మూవీ చూసిన వారు అంటున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఈ సినిమాకి హైలెట్ అవుతుందని అంటున్నారు.సో ఓవరాల్ గా ఫస్ట్ డీసెంట్ గా బాగానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం మొత్తం అంతా కూడా బాగా రొటీన్ గా ఉంటుందట. కానీ సెకండ్ ఆఫ్ లోని సీన్స్ మాత్రం మాస్ ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ ఉంది అని చూసినవారు అంటున్నారు. మొత్తంగా కథలో కానీ, టేకింగ్ లో కానీ కొత్తదనం అనేది లేకపోయినా ఇప్పుడు కనీసం చెప్పుకోడానికి అంతగా ఏ సినిమాలు లేవు కాబట్టి.. ‘రత్నం’ సినిమా పర్వాలేదు అనిపించుకొని మంచి ఓపెనింగ్స్ అయితే రాబట్టుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈవెనింగ్ నాటికి సినిమా టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: