సమంత... రాజ్ అండ్ డీకే కాంబో ప్రాజెక్ట్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ బ్యూటీ ఏం మాయ చేసావే అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యే మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సూపర్ సక్సెస్ ను అందుకుంది . ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా అనేక సినిమా అవకాశా లు దక్కడం అవి బ్లాక్ బాస్టర్ విజయాలను సాధిస్తూ వెళ్లడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది.
 

ఇకపోతే తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే సమంత తమిళ సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకొని అక్కడ కూడా టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లి పోయింది . ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె హిందీ పరిశ్రమపై కాన్సన్ట్రేషన్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా కొంత కాలం క్రితమే సమంత ... రాజు అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది.

ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు రావడంతో అందులో నటించిన సమంత కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె మరోసారి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న మరో క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోను ఈ రోజు సాయంత్రం 4 గంటల 56 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: