విక్రమార్కుడు తరహాలో.. మరోసారి అలాంటి పాత్రల్లో నటించబోతున్న రవితేజ?

praveen
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఇక వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఇక ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టు కొట్టాడు రవితేజ. ఇక ఈ సినిమాలో రవితేజ యాక్షన్ కి అభిమానులు అందరూ కూడా అయిపోయారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాల తో బిజీగా ఉన్నాడు. ఇక రవితేజ సినిమాలపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 కాగా ప్రస్తుతం హరిశంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. తనకు ఎంతో ఇష్టమైన హీరో రవితేజను హరి శంకర్ ఎలా చూపించబోతున్నాడు అని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇంకోవైపు అటు కామెడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న అనుదీప్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అనుదీప,  రవితేజ కాంబో అంటే కెవ్వు కేక అన్నట్లుగా ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు.

 అయితే రవితేజ చాలా రోజుల తర్వాత ఒకే సినిమాలో దొంగ, పోలీస్ పాత్రలలో నటించబోతున్నారట  అప్పుడెప్పుడో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో దొంగ, పోలీస్ పాత్రలలో నటించాడు రవితేజ. ఇక తర్వాత కొన్ని సినిమాలలో పోలీస్.. కొన్ని సినిమాలలో దొంగ పాత్రలో నటించిన ఒకే సినిమాలో పూర్తిస్థాయిలో దొంగ, పోలీస్ పాత్రల్లో నటించింది మాత్రం లేదు . కానీ ఇప్పుడు ఇలాంటి పాత్రలు మరోసారీ చేయబోతున్నాడట. అనుదీప్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో ఇలా దొంగ పోలీస్ పాత్రల్లో కనిపించబోతున్నాడట రవితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: