సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు పరుశురామ్. అంతకు ముందు చిన్న సినిమాలతో చిన్న హీరోలతో సినిమాలు చేసే ఈ దర్శకుడు ఒక్కసారి గా మహేష్ బాబు తో సినిమా చేయడం అందరినీ ఎంతగానో ఆనంద పరిచింది. కథలో దమ్మున్న కారణంగానే ఈ దర్శకుడితో కలిసి మహేష్ సినిమా చేశాడు. ఆయన పెట్టుకున్న నమ్మకం పరంగా సినిమా తెరకెక్కడం తో ఈ చిత్రం ఇంతటి మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా అలా పూర్తయిందో లేదో మహేష్ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా యొక్క స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. జూలై నెల నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే సర్కార్ వారి పాట లాంటి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు ఇప్పుడు వెయిటింగ్ లో ఉండడం, అది కూడా ఓ చిన్న హీరో కోసం ఆయన కొన్ని రోజులు వెయిట్ చేయవలసి వస్తుంది.
మహేష్ బాబు సినిమా కంటే ముందే నాగచైతన్యతో ఓ సినిమా చేయాలని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు పరుశురామ్. అయితే నాగచైతన్య ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం పరశురామ్ కూడా మహేష్ బాబు సినిమా ఆఫర్ రావడంతో ఈ చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ చిత్రం పూర్తయిన తర్వాత నాగచైతన్య సినిమా చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాగచైతన్య ఇప్పటికే కమిట్ అయినా కొన్ని ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఆయనతో సినిమా చేయాలంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసి ఉంది. ఇటీవలే మొదలుపెట్టిన దూత అనే వెబ్ సిరీస్ లో బిజీగా ఉన్న నాగచైతన్య థాంక్యూ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేశాడు. దూత షూటింగ్ పూర్తయిన తర్వాత పరశురాం సినిమా మొదలుపెట్టే ఆలోచనలో నాగచైతన్య ఉన్నాడు.